us: దక్షిణ కొరియాకు అమెరికా ఎఫ్-22 యుద్ధ విమానాలు... ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచే యత్నం!
- అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు
- డిసెంబర్ 4 నుంచి ప్రారంభం
- ఉత్తరకొరియాపై ఒత్తిడే లక్ష్యం
అమెరికాకు చెందిన శక్తిమంతమైన ఎఫ్-22 యుద్ధ విమానాలు దక్షిణ కొరియాకు బయల్దేరడం ఖాయమైంది. జపాన్ లోని ఒకైనవాలో తిష్ట వేసి ఉండే ఆరు ఫైటర్ జెట్స్ అమెరికా-దక్షిణకొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొననున్నాయి. డిసెంబర్ 4 నుంచి జరిగే ఈ విన్యాసాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి.
ఈ మేరకు దక్షిణ కొరియా మీడియా సాధనాలు ఈ రోజు కథనాలను ప్రచురించాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. ఉత్తరకొరియా అణు క్షిపణీ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆ దేశంపై ఒత్తిడిని మరింత పెంచే లక్ష్యంలో భాగంగానే అమెరికా, దక్షిణ కొరియా ఈ సైనిక విన్యాసాలను తలపెట్టాయి.