KCR: కేసీఆర్ ను కలిసిన సంపూర్ణేష్ బాబు!

  • కేసీఆర్ ను తొలిసారి కలిసిన సంపూ
  • 2019 ఎన్నికల్లో సంపూ చరిష్మాను ఉపయోగించుకునే అవకాశం
  • కేసీఆర్ ను కలిసిన పలువురు సెలబ్రిటీలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కలిశాడు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు సమాచారం. సినిమాలకు సంబంధించి తన భవిష్యత్ కార్యాచరణను ఈ సందర్భంగా సీఎంకు సంపూ వివరించాడు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన సంపూర్ణేష్ బాబుకు సినీ అభిమానుల్లో మంచి చరిష్మా ఉంది. దీంతో, 2019 ఎన్నికల్లో సంపూ చరిష్మాను ఉపయోగించుకోవాలని కేసీఆర్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ తో సంపూ భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకు ముందు పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. వారిలో ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా ఉంది.

KCR
sampoornesh babu
tollywood
  • Loading...

More Telugu News