prabhakar chowdary: మెట్లపై నుంచి దిగుతూ జారిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. ఆసుపత్రికి తరలింపు

  • ఇంట్లో మెట్లపై నుంచి జారిపడ్డ ప్రభాకర్ చౌదరి
  • తప్పిన ప్రమాదం
  • ఆందోళనకు గురైన కార్యకర్తలు, అభిమానులు

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ఆయన ఇంట్లోగల మెట్లపై నుంచి కిందకు దిగుతూ, జారిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు, ప్రభాకర్ చౌదరి గాయపడ్డారన్న వార్తలతో టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి వద్దకు, ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే, పెద్ద ప్రమాదమేమీ లేదని, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలుసుకుని, ఊపిరి పీల్చుకున్నారు.

prabhakar chowdary
Telugudesam mla
anantapuram mla
accident to prabhakar chowdary
  • Loading...

More Telugu News