raja singh: బీజేపీలో ఉన్న నటీమణులు కూడా అలాంటివారే అంటారా?: రాజా సింగ్ కు తమ్మారెడ్డి భరద్వాజ సూటి ప్రశ్న

  • సినీ పరిశ్రమలోని మహిళలంతా చెడిపోయారని నోరు జారిన రాజాసింగ్
  • బీజేపీలో ఉన్న సినీ నటీమణులు కూడా చెడిపోయారంటారా?
  • ఇలాంటి కుసంస్కార ప్రజాప్రతినిధులతో నేను మాట్లాడనన్న తమ్మారెడ్డి 

సినీ పరిశ్రమలోని మహిళలు మంచంపై పరుపును మార్చినట్టు పురుషులను మార్చేస్తారని రాజస్థాన్ కు చెందిన ఎంపీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ వాస్తవమని ఒక టీవీ ఛానెల్ చేపట్టిన చర్చలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించారు. సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. కొంత మంది మహిళలు అలాంటి పనులు చేస్తున్నారని ఆయన తెలిపారు.

దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలోని మహిళలంతా అలాంటివారే అంటున్న ఆయన.. బీజేపీలో ఉన్న నటీమణులు కూడా అలాంటివారే అంటారా? అని ఆయన నిలదీశారు. ఇలాంటి కుసంస్కారులతో మాట్లాడడం తనవల్ల కాదని, ఇలాంటి వారితో మాట్లాడే స్థాయికి తాను దిగజారలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చలో తాను పాల్గొనలేనని చెప్పి ఆయన లేచి వెళ్లిపోయారు.

అనంతరం రాజా సింగ్ మాట్లాడుతూ, యూట్యూబ్ లో సినీ నటీమణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు కనబడతాయని అన్నారు. సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. 

raja singh
tammareddy bhardwaja
controversy
comments
  • Loading...

More Telugu News