North Korea: ఉత్తరకొరియాకు ఊహించని మద్దతు.. అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్యూబా!

  • ఉత్తరకొరియాకు క్యూబా మద్దతు..అమెరికాపై విమర్శలు
  • ఎలాంటి చర్చలు జరపకుండా ఆంక్షలు విధించడం తప్పు
  • అమెరికా ఏకపక్ష, నిర్హేతుకమైన డిమాండ్లను ఖండిస్తున్నాం

ఉత్తరకొరియాకు ఊహించని మద్దతు దొరికింది. అణుపరీక్షల నేపథ్యంలో ఏకాకిగా మారిన ఉత్తరకొరియాకు క్యూబా మద్దతు పలికింది. క్యూబా రాజధాని హవానాలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రితో క్యూబా విదేశాంగ శాఖ మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా విధానాలను తూర్పారబట్టారు.

ఎలాంటి చర్చలు లేకుండా ఆంక్షలు విధించడం, ఉగ్రవాద దేశాల సరసన ఉత్తరకొరియాను చేర్చడంపై ఈ రెండు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమెరికా ఏకపక్ష, నిర్హేతుకమైన డిమాండ్లను ఖండిస్తున్నామని ఉమ్మడి ప్రకటన చేశారు. ప్రజల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, వివాదాలకు శాంతియుతమైన ఒప్పందాల ద్వారా ముగింపు పలకాలని క్యూబా విదేశాంగ శాఖ మంత్రి సూచించారు. 

  • Loading...

More Telugu News