YSRCP: పాదయాత్రకు మూడో బ్రేక్.. వెల్దుర్తి నుంచి హైదరాబాద్‌కు జగన్!

  • నేడు సీబీఐ కోర్టులో హాజరుకానున్న జగన్
  • గురువారం వెల్దుర్తి  పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్న వైసీపీ చీఫ్
  • పాదయాత్ర ప్రారంభమయ్యాక ఇది మూడోసారి

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు మరోమారు బ్రేక్ పడింది. నేడు సీబీఐ కోర్టులో జగన్ హాజరుకావాల్సి ఉండడంతో పాదయాత్రను మధ్యలో ముగించి హైదరాబాద్ చేరుకున్నారు. పాదయాత్రలో భాగంగా గురువారం జగన్ కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పర్యటించారు. షరా మామూలుగానే ప్రజలకు బోలెడన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.

పాదయాత్ర నేపథ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు కొట్టివేయడంతో పాదయాత్రకు ప్రతివారం బ్రేక్ పడుతోంది. నేడు కోర్టులో హాజరుకావాల్సి ఉండడంతో గురువారం వెల్దుర్తిలో పర్యటన ముగించుకున్న ఆయన హైదరాబాద్ బయల్దేరారు. పాదయాత్ర ఆపిన చోటు నుంచే శనివారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. జగన్ పాదయాత్ర చేపట్టాక సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇది మూడోసారి.

YSRCP
YS Jagan
Pada Yatra
CBI
  • Loading...

More Telugu News