ramgopal verma: ఇవాంకా ట్రంప్ ను కూడా వదలని వర్మ.. వరుస పోస్టులతో ఆమె అందంపై వ్యంగ్యాస్త్రాలు!

  • 28న హైదరాబాదు రానున్న ఇవాంకా
  • ఇవాంకాకు తాను అందంగా ఉంటానన్న అహంకారం
  • కేసీఆర్ అందం చూసి ఇవాంకా షాక్ అవ్వడం ఖాయం
  • పందెం కాస్తా.. కేసీఆర్ పక్కన ఇవాంకాను ఎవరూ చూడరు! 

వివాదాలతో సావాసం చేసే రాంగోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ను కూడా వదల్లేదు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాదు వేదికగా జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (జీఈఎస్‌)–2017లో ఇవాంకా ముఖ్యఅతిథిగా పాల్గొననున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన ఫేస్ బుక్ పేజ్ లో వర్మ స్పందిస్తూ, 'ఇవాంకాకు తాను అందంగా ఉంటానన్న అహంకారం ఎక్కువ. అయితే, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఆమె షాక్‌ అవ్వడం ఖాయం. కేసీఆర్, ఇవాంకా పక్కపక్కన కూర్చుంటారు కాబట్టి, అప్పుడు ఇవాంకాను ఎవరూ చూడరని పందెం కాస్తాను. అలాగే, ఇవాంకాకు అంతర్జాతీయ అందగత్తెగా, మొత్తం కుటుంబం చూడతగ్గ ఉత్తమ అందగత్తెగా, ఉత్తమ ప్రపంచ సుందరి నాయకురాలిగా.. మూడు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు ఇవ్వాలి' అంటూ వరుసగా పోస్టులు పెట్టాడు.

ramgopal verma
ivanka trump
KCR
facenook post
  • Loading...

More Telugu News