మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా 'ఓటర్' ఫస్టులుక్ రిలీజ్!
- విష్ణు హీరోగా రూపొందిన 'ఓటర్'
- తమిళంలో టైటిల్ 'కురళ్ 388'
- ఈ సినిమాతోనే తమిళంలోకి విష్ణు ఎంట్రీ
కేంద్ర .. రాష్ట్ర రాజకీయనాయకుల ముఖ చిత్రాల మధ్య విష్ణు ఒక ఓటర్ గా ఓటు వేసినట్టు తన వేలుకి గల ఇంకు మార్కును చూపిస్తూ ఆవేశంతో కనిపిస్తున్నాడు. టైటిల్ కి తగిన నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందుతోంది. తమిళంలో ఈ సినిమాకి 'కురళ్ 388' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళ తెరకి ఈ సినిమాతోనే విష్ణు పరిచయమవుతుండటం విశేషం. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాను, వచ్చేనెలలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.