pavan mallela: 'బాలకృష్ణుడు' దర్శకుడితో సాయిధరమ్ తేజ్ మూవీ ఖరారు!

  • పవన్ మల్లెల దర్శకత్వంలో 'బాలకృష్ణుడు'
  • రెండవ సినిమా సాయిధరమ్ తేజ్ తో 
  • వేసవిలో సెట్స్ పైకి వెళ్లే ఆలోచన

బీవీఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన 'జవాన్' వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వైపున ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో వైపున వినాయక్ తో సినిమాను కూడా తేజు ఫాస్టుగానే కానిచ్చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత తేజు సినిమా ఏ దర్శకుడితో వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఈ నేపథ్యంలో పవన్ మల్లెల పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 రీసెంట్ గా ఆయన ఒక కథను సాయిధరమ్ తేజ్ కి వినిపించడం .. ఆయన నుంచి వెంటనే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయట. నారా రోహిత్ హీరోగా పవన్ మల్లెల తెరకెక్కించిన 'బాలకృష్ణుడు' .. రేపు భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమాను నిర్మించినవారే తేజు సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వేసవిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నారు. మొత్తానికి పవన్ మల్లెల మొదటి సినిమా విడుదలకి ముందే రెండవ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషమేనని చెప్పాలి.             

pavan mallela
sai dharam tej
  • Loading...

More Telugu News