viral video: వైర‌ల్ వీడియో: ఆఫీస‌ర్ల‌తో క‌లిసి పుష‌ప్స్ చేస్తున్న పోలీసు డాగ్‌!

  • 7 సెక‌న్ల వీడియోకు 7ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌లు
  • ఆక‌ట్టుకుంటున్న శునకం వీడియో
  • వీడియో షేర్ చేసిన అల‌బామా గ‌ల్ఫ్ షోర్ పోలీసులు

విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా పోలీసు శాఖ‌లో ప‌నిచేసే వారు శారీరకంగా చాలా ఫిట్‌గా ఉండాల్సివ‌స్తుంది. అందుకు వ్యాయామానికి మించిన మార్గం మ‌రోటి లేదు. అది జంతువుల‌కైనా, మ‌నుషుల‌కైనా కావాల‌ని అల‌బామా గ‌ల్ఫ్ షోర్ పోలీసులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా వారి శాఖ‌లో ఉన్న కే9 ఆఫీస‌ర్ (పోలీసు డాగ్ ర్యాంకింగ్‌) త‌మ‌తో క‌లిసి పుష‌ప్స్ చేస్తున్న వీడియోను వారు షేర్ చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో పోలీసు శాఖ‌లో చేరిన నైట్రో అనే డ‌చ్ షెఫ‌ర్డ్ శున‌కం, ఆఫీస‌ర్లు కోవ‌న్‌, హాంకాక్‌ల‌తో క‌లిసి పుష‌ప్స్ చేయ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. కేవ‌లం ఏడు సెక‌న్లు మాత్ర‌మే ఉన్న ఈ వీడియోను ఇప్ప‌టికే 7,29,041ల మంది చూశారు. విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో 25,400 సార్లు షేర్ అయింది.

viral video
push-ups
police dog
alabama
gulf shore
shephard
  • Error fetching data: Network response was not ok

More Telugu News