Gionee: ఒకేసారి 8 స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తున్న జియోనీ.. 6జీబీ ర్యామ్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- ఈ నెల 26న మార్కెట్లోకి..
- అదిరిపోయే ర్యామ్.. అద్భుతమైన ఫీచర్లు!
- వివరాలు వెల్లడించని జియోనీ
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ జియోని నుంచి ఈ వారంలో ఏకంగా ఎనిమిది స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. 26న 8 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు జియోనీ ప్రకటించింది. జియోనీ ఎం7 ప్లస్, జియోనీ ఎస్ 11, జియోనీ ఎస్ 11, ఎస్ 11ఎస్ , జియోనీ ఎఫ్ 205, జియోనీ ఎఫ్ 6, జియోనీ స్టిల్ 3, జియోనీ ఎం 7 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ ఫోన్లన్నీ బేజెల్-లెస్ డిస్‌ప్లేతో రానున్నాయి.
ఫోన్ మోడళ్ల గురించి మాత్రమే వెల్లడించిన సంస్థ ఫీచర్ల వివరాలు వెల్లడించలేదు. అయితే లీకైన సమాచారం ప్రకారం ఎస్ 11 మోడల్.. 5.99 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 16 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఎఫ్ 205 మోడల్.. 5 అంగుళాల డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 8 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ధర వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. డిస్‌ప్లే, ర్యామ్, ఇంటర్నల్ మెమొరీలో కొద్దిపాటి మార్పులతో మొత్తం 8 ఫోన్లు దాదాపు ఇలానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.