bhuvaneswar kunar: నేడే క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ వివాహం!

  • మీరట్ లో నేడు భువనేశ్వర్ కుమార్ వివాహం
  • గతనెలలోనే ట్విట్టర్ మాధ్యమంగా ప్రేమలో ఉన్నానని ప్రకటన 
  • చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నాగర్ తో వివాహం

టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వివాహం చేసుకోనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నాగర్ ను భువీ వివాహం చేసుకుంటున్నాడు. తాను ప్రేమలో ఉన్నానని గత నెలలో భువీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఇతని స్వస్థలం మీరట్‌ లో నేడు వీరి వివాహం జరుగుతోంది.

వివాహం కారణంగా, శ్రీలంకతో జరగనున్న తరువాతి రెండు టెస్టులకు భువీ దూరం కానున్నాడు. కాగా, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ స్నేహితుడు భువీకి శుభాకాంక్షలు చెబుతూ...‘మా జట్టులో మరో పులి బిడ్డ ఇకపై భార్యకు బానిస కాబోతున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి భువీ సమాధానమిస్తూ ‘ఆమె ప్రేమకు బానిసను’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

bhuvaneswar kunar
marriage
meerat
nupur nagar
  • Error fetching data: Network response was not ok

More Telugu News