Kamal Haasan: దీపిక శరీరం కన్నా ఆమె తలకే ఎక్కువ గౌరవం ఇవ్వాలి!: కమలహాసన్

  • దీపికకు రక్షణ కల్పించాలి
  • ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాం
  • ఇప్పుడు ఆలోచిద్దాం

'పద్మావతి' సినిమా నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకునేకు తీవ్ర హెచ్చరికలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ముక్కు కోయాలంటూ కొందరు, తలను తీసుకు రావాలంటూ మరి కొందరు భారీ నజరానాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపికకు ప్రముఖ నటుడు కమలహాసన్ మద్దతుగా నిలిచారు. దీపిక సురక్షితంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని కమల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 "దీపిక తలకు రక్షణ కల్పించాలి. ఆమె శరీరం కంటే ఆమె తలకే ఎక్కువ గౌరవాన్ని ఇవ్వాలి. నా సినిమాలను కూడా ఎన్నో వర్గాలు గతంలో వ్యతిరేకించాయి. ఏ విషయంలోనైనా, ఏ చర్చలోనైనా పరిధికి మించిన తీవ్రత మంచిది కాదు. ఇప్పటికే ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడాం. ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అమ్మా, భారతమాతా విను" అంటూ ట్వీట్ చేశారు.

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకునే తలలను తీసుకు వచ్చినవారికి రూ. 10 కోట్లు ఇస్తానంటూ హర్యాణా బీజేపీ చీఫ్ మీడియా కోఆర్డినేటర్ సురాజ్ పాల్ ప్రటించిన నేపథ్యంలో, కమల్ పైవిధంగా స్పందించారు. వీరి తలలను నరికిన వారికి రూ. 5 కోట్లు ఇస్తామంటూ క్షత్రియ కమ్యూనిటీ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Kamal Haasan
deepika padukone
tollywood
padmavathi movie
sanjay leela bhansali
  • Loading...

More Telugu News