jayalalitha: అపస్మారక స్థితిలోనే జయలలితను ఆసుపత్రికి తీసుకెళ్లారు...కీలక పెన్ డ్రైవ్ లభ్యం?

  • సహాయకుడు పూంగుండ్రం గదుల్లో పెన్ డ్రైవ్ లభ్యం
  • పెన్ డ్రైవ్ లో జయలలితను ఆసుపత్రికి తరలించేందుకు గంటముందు విజువల్స్ 
  • ఆసుపత్రిలో చికిత్స సందర్భంగా విజువల్స్ 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరే సమయానికే అపస్మారకస్థితిలో వున్నారన్న విషయం తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కలిగిన పెన్ డ్రైవ్ ఐటీ అధికారుల దగ్గర ఉందని తెలుస్తోంది.

ఇటీవల శశికళ నివాసాలు, ఆస్తులపై దాడులు చేసిన ఐటీ అధికారులకు పొయెస్ గార్డెన్, వేదనిలయంలోని పూంగుండ్రం గదుల్లో జరిపిన తనిఖీల్లో ఒక పెన్ డ్రైవ్ లభ్యమైందని, అందులో దీనికి సంబంధించిన దృశ్యాలున్నాయని తెలుస్తోంది. కేవలం అపస్మారక స్థితిలో ఉన్న జయలలితను ఆసుపత్రికి తరలించేందుకు గంటముందు నమోదైన సీసీటీవీ దృశ్యాలతో పాటు, జయలలిత చికిత్సకు సంబంధించిన దృశ్యాలు కూడా అందులో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.  

jayalalitha
vedanilayam
pungundram
pendrive
cctv visuals
  • Loading...

More Telugu News