swami nityananda: నటి రంజితతో నిత్యానంద ఆయిల్ మసాజ్ టేపులు నిజమైనవే!: ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణ
- 2010లో బట్టబయలైన నిత్యానంద, రంజితల ఆయిల్ మసాజ్ వ్యవహారం
- లైంగిక పటుత్వం లేదని ప్రకటించి, ఆ టేపులు ప్రత్యర్థుల సృష్టి అన్న నిత్యానంద
- ఆ టేపులు వాస్తవమైనవేనని నిగ్గు తేల్చిన ఫోరెన్సిక్ ల్యాబ్
2010లో సినీ నటి రంజిత, స్వామి నిత్యానంద సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ వీడియో నేపథ్యంలో నిత్యానంద తన భక్తులను మోసం చేశారంటూ కేసు నడిచింది. అయితే తనలో లైంగిక పటుత్వం లేదని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్వామి నిత్యానంద అప్పట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ వీడియో టేపులు వాస్తవమా? కాదా?.. వాటిని ఎవరైనా తయారు చేసి స్వామీజీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారా? అన్నది నిగ్గుతేల్చేందుకు ఆ టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వీటిని సుదీర్ఘ కాలం శాస్త్రీయంగా పరిశీలించిన నిపుణులు... ఆ టేపులు ఎవరో క్రియేట్ చేసినవి కాదని, ఒరిజనల్ టేపులేనని నిర్ధారించారు.