kancha ilaiah: కంచ ఐలయ్యపై దాడికి యత్నం... కోరుట్లలో తీవ్ర ఉద్రిక్తత!

  • కోర్టు విచారణ నిమిత్తం కోరుట్ల వచ్చిన ఐలయ్య
  • ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలు
  • అడ్డుకున్న పోలీసులు

'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు కంచ ఐలయ్య. ఆయనపై వైశ్యులు, బ్రాహ్మణులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై పలు చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ పుస్తకానికి సంబంధించి ఒక కేసు విచారణ నిమిత్తం ఆయన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టుకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో, ఆయన బస చేసిన లాడ్జి వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హోటల్ పై దాడికి యత్నించారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకుని, బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్నారు. ఐలయ్యకు రక్షణ కల్పించారు. అనంతరం ఆయన పోలీసు రక్షణలోనే కోర్టుకు వెళ్లారు. 

kancha ilaiah
kancha ilaiah attacked
korutla
saamajika smugglarlu komatollu
  • Loading...

More Telugu News