producer ashok suicide: ఆత్మహత్యకు పాల్పడ్డ తమిళ సినీ నిర్మాత అశోక్

  • అప్పులే ఆత్మహత్యకు కారణం
  • సినీ నటుడు, దర్శకుడు శశికుమార్ కు అశోక్ దగ్గరి బంధువు
  • సంతాపం ప్రకటించిన కోలీవుడ్ ప్రముఖులు

తమిళ సినీ నిర్మాత అశోక్ నిన్న సాయంత్రం చైన్నైలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. చెన్నైలోని ఆర్కాడు రోడ్డు వలసరవాక్కం ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. పలు సినిమాలకు అశోక్ సహ నిర్మాతగా పెట్టుబడులు పెట్టారు. అప్పుల ఊబిలో కూరుకుపోవడమే అశోక్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. అప్పులు తిరిగి చెల్లించాలంటూ అప్పిచ్చినవారు వేధిస్తుండటంతో... మనస్తాపానికి గురై, ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రముఖ దర్శకుడు, నటుడు శశికుమార్ కు అశోక్ దగ్గరి బంధువు. అశోక్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

producer ashok suicide
producer ashok
kollywood
  • Loading...

More Telugu News