ivanka trump: 'మనకేమీ తెల్వద్.. అంతా అమెరికోళ్లే చూసుకుంటుండ్రు': ఇవాంకా పర్యటనపై నాయిని

  • ఇవాంక పర్యటన గురించిన సమాచారం తెలియదన్న హోం మంత్రి నాయిని
  • నాయిని సమాధానంతో అవాక్కైన మీడియా ప్రతినిధులు
  • పర్యటన వివరాలు గోప్యంగా ఉంచాలనే అలా అన్నారు

ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ హైదరాబాదులో జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన ఆకర్షణగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ నిలవనున్నారు. ఆమె రాక సందర్భంగా హైదరాబాదులో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఈ నేపథ్యంలో మీడియా ఇవాంకా పర్యటన గురించి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ప్రశ్నించగా..‘మనకేం తెల్వదు. అంతా అమెరికోళ్లు చూసుకుంటున్నరు. వాళ్లు ఇప్పటికే నగరానికి వచ్చిండ్రు’ అంటూ సమాధానం చెప్పారు. 'యాడంగ వస్తందో.. యానంగ పోతందో మనకు తెల్వదు. అంతా అమెరికా వాళ్ల చేతుల్లోనే ఉంది’ అని ఆయన పేర్కొనడంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అయితే ఆయన ఇవాంకా పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించడం ఇష్టం లేక ఇలా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఆమె రాక సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాదులో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. 

ivanka trump
naini narsimha reddy
comments
  • Loading...

More Telugu News