Jammu and Kashmir: ఫరూఖ్ అబ్దుల్లా నాలుక కోసి తెస్తే 21 లక్షలు ఇస్తాం!: ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్

  • పీవోకేపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్ అబ్దుల్లా
  • ఆయన రాజద్రోహానికి పాల్పడ్డారంటూ నజరానా ప్రకటించిన విరేష్ శాండిల్య
  • ఫరూఖ్ కు కేటాయించిన జడ్ కేటగిరీ భద్రత ఉపసంహరించాలని డిమాండ్

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నాలుక కోసి తెచ్చినవారికి 21 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ అధినేత విరేష్ శాండిల్య సంచలన ప్రకటన చేశారు. పీవోకే పాకిస్థాన్ కు చెందినదని, దానిని స్వాధీనం చేసుకునే ధైర్యం భారత్ కు లేదని, పీవోకే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాండిల్య చండీగఢ్ లో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో ఫరూక్ రాజద్రోహానికి పాల్పడ్డారని అన్నారు. ఆయనకు కేటాయించిన జడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన నాలుక కోసి తెచ్చిన వారికి 21 లక్షల రూపాయలు నజరానాగా అందజేస్తానని ఆయన ప్రకటించారు. 

Jammu and Kashmir
farooq abdullah
viresh sandilya
  • Loading...

More Telugu News