padmavati: ‘పద్మావతి’ సినిమాకి మద్దతుగా మాట్లాడిన రచయిత జావేద్ అక్తర్.. పోలీస్ కేసు నమోదు!
- రాజ్‌పుత్‌లను అవమానిస్తూ మాట్లాడిన జావేద్ అక్తర్
- రాజ్‌పూత్‌లు, రాజ్‌వాడాలు బ్రిటీష్ పాలకులపై పోరాటం చేయలేదని వ్యాఖ్యలు
- జైపూర్‌లోని సింధి క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో రాజ్‌పుత్‌ల ఫిర్యాదు
దీపికా పదుకునే నటించిన తాజా చిత్రం ‘పద్మావతి’ దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా రేపుతోన్న వివాదంపై బాలీవుడ్ సీనియర్ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ... రాజ్‌పూత్‌లు, రాజ్‌వాడాలు ఎప్పుడు కూడా బ్రిటీష్ పాలకులపై పోరాటం చేయలేదని, పద్మావతి సినిమా, రూపకర్తపై వీధి పోరాటాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌కు చెందిన ఈ రాణాలు, రాజులు, మహారాజులు మన దేశాన్ని పాలించిన బ్రిటీషు వారి కోర్టుల్లో పనిచేశారని, రాజ్‌పుత్‌ల గౌరవం అప్పుడేమయిందని ఎద్దేవా చేశారు.
దీంతో ఆగ్రహం చెందిన రాజ్‌పుత్ కర్ణిసేన, తమను అవమానించారని జావేద్ అక్తర్‌పై జైపూర్‌లోని సింధి క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. సదరు రచయిత చేసిన వ్యాఖ్యల్లో 200 ఏళ్ల చరిత్రలో రాజ్‌పూత్‌లు ఎప్పుడూ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదనే వ్యాఖ్య ఉండడంతో కేసు నమోదైంది.