padmavati: ‘పద్మావతి’ సినిమాపై వివాదం చల్లారాలంటే ఇలా చేస్తే సరి!: కేంద్ర మంత్రి సూచన
- ‘పద్మావతి’ సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు
- హెచ్చరికలు చేస్తోన్న వారు ఈ సినిమాను చూడాలి-బీరేందర్ సింగ్
- ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించమనాలి
- చారిత్రక వాస్తవాలు మన ప్రస్తుత ఆలోచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు
దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై తీవ్ర వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను విడుదల చేస్తే విధ్వంసం తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హిందూ సంఘాలు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ అందరకీ ఓ సలహా ఇచ్చారు.
ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు మొదట సినిమాను చూడాలని చెప్పారు. పద్మావతి సినిమాలో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిని తొలగించాలని డిమాండ్ చేయాలని అన్నారు. ఈ సినిమాలో కొన్ని చారిత్రక వాస్తవాలు మన ప్రస్తుత ఆలోచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.