bunny vasu: పోసాని గారూ, మీరు వంద శాతం అర్హులు: బన్నీ వాసు

  • నంది అవార్డుకు మీరు అర్హులు
  • మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం
  • ఏపీకి చెందిన వాళ్లమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

తాను నంది అవార్డులను స్వీకరిస్తే 'కమ్మోడివి కాబట్టి నంది వచ్చింది' అంటూ కామెంట్ చేస్తారని... ఇలాంటి నంది అవార్డు తనకు అవసరం లేదని... అవార్డును తాను తిరస్కరిస్తున్నానని నటుడు పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అవార్డులను విమర్శించిన వారిని నాన్ లోకల్ అంటారా? అంటూ ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నంది అవార్డులకు ప్రాంతీయతను అంటగట్టడం సరికాదని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. "పోసాని గారు, ఈ అవార్డును స్వీకరించడానికి మీరు 100శాతం అర్హులు సార్. మనం ఏపీలోనే పుట్టాం, ఏపీలోనే పెరిగాం, అమెరికాలో కాదు... ఏపీలోనే చదువుకున్నాం, అమెరికాలో కాదు.... మన యాక్సెంట్ ఏపీనే... ఏపీకి చెందిన వాళ్లమని నిరూపించుకోవాల్సిన అవసరం మనకు లేదు" అంటూ వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News