harbhajan singh: ట్వీట్ లో పొరపాటుకు.. హర్భజన్ కు క్షమాపణ చెప్పిన గంగూలీ!

  • భార్య, కుమార్తెతో కలసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో ఉంచిన భజ్జీ
  • బాబు అందంగా ఉన్నాడంటూ గంగూలీ కామెంట్
  • ఆ తర్వాత సరిదిద్దుకున్న సౌరవ్


బాలీవుడ్ నటి గీతా బస్రాను టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప పుట్టింది. తాజాగా తన భార్య, కుమార్తెలతో కలసి స్వర్ణ దేవాలయం వద్ద దిగిన ఫొటోను భజ్జీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.

'బాబు చాలా అందంగా ఉన్నాడు. ఎంతో ప్రేమను పంచాలి' అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు. 'క్షమించాలి... పాప చాలా అందంగా ఉంది... వయసు పెరుగుతోంది భజ్జీ' అంటూ మరో ట్వీట్ చేశాడు. 

harbhajan singh
sourav ganguly
geetha basra
  • Loading...

More Telugu News