raghavendra rao: చిన్న సినిమా చేసే ఆలోచనలో రాఘవేంద్రరావు?

  • భారీ చిత్రాలను తెరకెక్కించిన రాఘవేంద్రరావు 
  • ఆ తరువాత భక్తి రస చిత్రాలతో వరుస విజయాలు 
  • సొంత బ్యానర్లో చిన్న సినిమా చేయాలనే నిర్ణయం

బలమైన కథా కథనాలను కలర్ ఫుల్ గా చెప్పడంలోను .. అన్నివర్గాల ఆడియన్స్ ను మెప్పించడంలోను రాఘవేంద్రరావు సిద్ధహస్తులు. ఎంతోమంది హీరోలకు భారీ విజయాలను అందించారాయన .. మరెంతో మంది హీరోయిన్స్ కి గ్లామర్ పరంగా మంచి క్రేజ్ తీసుకొచ్చారు. అలాంటి రాఘవేంద్రరావు .. ఈ మధ్య కాలంలో భక్తిరస చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు.

తాజాగా ఆయన ఓ మాదిరి బడ్జెట్ లో పూర్తి వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయానికి వచ్చారట. ఓ మంచి కథను సిద్ధం చేసుకుని .. ఓ యంగ్ హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఆయన వున్నారని సమాచారం. అందుకోసం ఆయన కథలు వింటున్నారట. కథ ఓకే అయితే ఆర్కా మీడియా బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. భారీ తారాగణంతో .. భారీ చిత్రాలతో విజయాలను అందుకుంటూ వచ్చిన రాఘవేంద్రరావు, చిన్న సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతుండటం విశేషం.  

raghavendra rao
  • Loading...

More Telugu News