mars: మార్స్ 2020 మిషన్‌లో మొదటి విజయం సాధించిన నాసా... వీడియో చూడండి
- అరుణగ్రహంపై మొదటి ప్యారాచూట్ ల్యాండింగ్‌ని పరీక్షించిన నాసా
- ఆస్పైర్ ప్రయోగం ద్వారా అక్టోబర్‌లో పేలోడ్ పంపిన అమెరికా అంతరిక్ష కేంద్రం
- వీడియో విడుదల చేసిన నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ
2020లో అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మార్స్ మిషన్‌లో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్యారాచ్యూట్ ద్వారా అంగారక వాతావరణంలోకి పే లోడ్ ప్రవేశపెట్టడంలో విజయం సాధించింది. సెకనుకు 5.4 కి.మీ.ల వేగంతో అంగారక వాతావరణంలోకి ప్రవేశించే పే లోడ్ వేగాన్ని ప్రత్యేక వస్త్రంతో తయారుచేసిన ప్యారాచ్యూట్ ద్వారా తగ్గించడమే లక్ష్యంగా ఈ పరీక్ష చేశారు.
ఈ ప్రయోగానికి అడ్వాన్స్‌డ్ సూపర్‌సోనిక్ ప్యారాచ్యూట్ ఇన్‌ఫ్లేషన్ రీసెర్చ్ ఎక్స్‌పెరిమెంట్ (ఆస్పైర్) అని పేరు పెట్టారు. అక్టోబర్ 4న అమెరికాలోని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుంచి జరిగిన ఈ ప్రయోగంలో ముందు రాకెట్ ద్వారా దాదాపు 51 కి.మీ.ల ఎత్తులోకి పేలోడ్‌ని పంపి, తర్వాత అది ల్యాండ్ అయ్యే సమయంలో ప్యారాచ్యూట్ స్థితిగతులను, మార్పులను అధ్యయనం చేశారు. ఆ అధ్యయనానికి అనుగుణంగా ప్యారాచ్యూట్ తయారీలో లోపాలను సవరించడం వంటి మార్పులు చేస్తారు. అంగారక గ్రహ వాతావరణంలోనూ ప్యారచ్యూట్ ఇలాగే పనిచేసే అవకాశం ఉందని సాంకేతిక నిపుణుడు ఇయాన్ క్లార్క్ తెలిపారు.
ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తమ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రాకెట్ ప్రయోగం నుంచి పే లోడ్ ల్యాండ్ కావడం, ప్యారాచ్యూట్ తెరుచుకోవడం, రాకెట్ తిరిగి అట్లాంటిక్‌లో పడడం ఈ వీడియోలో చూడొచ్చు.