winkle Khanna‏: బీజేపీ నేతకు ట్వింకిల్ ఖన్నా వ్యంగ్య ట్వీట్!

  • పద్మావతి నటి, దర్శకుడి తలలు తెస్తే 10 కోట్లిస్తానన్న బీజేపీ నేతకు ట్వింకిల్ ప్రశ్న
  • ఆ పది కోట్లలో జీఎస్టీ కలిపారా? లేదా?
  • దేశం తెలుసుకోవాలనుకుంటోంది

‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి, హీరోయిన్ దీపికా పదుకొనే తలలు తెస్తే 10 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని బీజేపీ నేత సూరజ్ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు అక్షయ్ కుమార్ భార్య, నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా స్పందించింది.

'ఇంతకీ ఆయన ప్రకటించిన 10 కోట్ల రూపాయల నజరానాకు జీఎస్టీ కలిపే ప్రకటించారా? లేక జీఎస్టీ మినహాయించి ప్రకటించారా? దేశం తెలుసుకోవాలనుకుంటోంది!' అంటూ ప్రశ్నిస్తూ ట్వింకిల్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ఈ సినిమా కనీవినీ ఎరుగని విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News