trisha: ఈ రోజు నుంచి నా కొత్త జీవితం ఆరంభమవుతోంది: త్రిష

  • యునిసెఫ్ బాలల హక్కుల సెలబ్రిటీ అడ్వొకేట్ గా త్రిష
  • తమిళనాడు, కేరళ రాష్ట్రాల బాలల హక్కులపై నినదించే అవకాశం 
  • కొత్త ప్రయాణం మొదలైందన్న ముద్దుగుమ్మ 

 ప్రముఖ సినీ నటి త్రిష యునిసెఫ్‌ కు సెలబ్రిటీ అడ్వొకేట్ గా నియమితురాలైంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని యునిసెఫ్ తమిళనాడులో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణలో త్రిషను భాగస్వామిని చేస్తున్నట్టు యునిసెఫ్ ప్రకటించింది. యునిసెఫ్ బాలల హక్కుల సెలబ్రిటీ అడ్వొకేట్ గా త్రిష బాధ్యతలు నిర్వర్తించనున్నారని తెలిపింది.

తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఆమె సెలబ్రిటీ అడ్వొకేట్ గా బాధ్యతలు చేపట్టారని, బాలలకు వ్యతిరేకంగా జరిగే చర్యలపై ఆమె గళమెత్తుతారని యునిసెఫ్ ప్రకటించింది. దీనిపై త్రిష మాట్లాడుతూ, తన కొత్త ప్రయాణం మొదలైందని చెప్పింది. యునిసెఫ్ బాధ్యతలు తన గౌరవాన్ని మరింత పెంచుతున్నాయని చెప్పింది. బాలల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నామని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చిన్నారులతో త్రిష మాట్లాడింది. దీనిపై ట్వీట్ చేసిన త్రిష కొత్త బాధ్యతలు స్వీకరించానని అభిమానులకు తెలిపింది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News