shahid kapoor: ఏ వర్గంపైనా నేను వ్యాఖ్యలు చేయదలచుకోలేదు: ప‌ద్మావ‌తి సినిమాపై షాహిద్ క‌పూర్

  • కొంద‌రు హెచ్చ‌రిక‌లు చేస్తోన్న తీరు సిగ్గుచేటు
  • ఆవేశపడేందుకు ఇది సమయం కాదు
  • ఇది మనం గ‌ర్వపడే సినిమా
  • హింసకు దారితీసే చర్చ ఏదీ మంచిది కాదు

'ప‌ద్మావ‌తి' సినిమాపై రాజుకున్న వివాదం కార‌ణంగా ఆ చిత్రం విడుద‌ల వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో న‌టించిన  షాహిద్‌కపూర్ తాజాగా మాట్లాడుతూ.. ప‌ద్మావతి క‌థ నేప‌థ్యాన్ని బట్టి కొన్నిసార్లు సమస్య రావ‌చ్చని అన్నారు.  తాను మాత్రం ఆశావాహ‌ దృక్పథంతో ఉంటానని, ఆవేశపడేందుకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. ఇటువంటి స‌మ‌యంలో చాలా మంది ప్రశాంతతను కోల్పోతార‌ని, దానిని కోల్పోకూడదని సూచించారు.

ఈ సినిమా విడుద‌ల అంశంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియపై త‌నకు నమ్మకం ఉందని, తాను న‌టించిన ఈ చిత్రం కచ్చితంగా విడుదలవుతుందని చెప్పారు. ఇది మనం గ‌ర్వపడే సినిమా అని, ఒకసారి ప్రజలు సినిమా చూస్తే ఇప్పుడు జరుగుతున్న వివాదాన్ని మర్చిపోతారని షాహిద్‌కపూర్ తెలిపారు. హింసకు దారితీసే చర్చ ఏదీ మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఏ వర్గంపైనా తాను వ్యాఖ్యలు చేయదలచుకోలేదని పేర్కొన్నారు. ఈ సినిమా విడుద‌ల చేస్తే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని కొంద‌రు చేస్తోన్న వ్యాఖ్య‌లు సిగ్గుచేట‌ని వ్యాఖ్యానించారు.    

shahid kapoor
padmavati
release
  • Loading...

More Telugu News