Air Hostess: హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో ఇండిగో ఉద్యోగినిపై అసభ్య ప్రవర్తన‌.. తర్వాత కాళ్లు పట్టుకుని క్షమాపణ!

  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • కాళ్లు ప‌ట్టుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నిందితులు
  • నిందితుల‌ను వ‌దిలేసిన పోలీసులు

హైద‌రాబాద్ శివారులోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యంలో ఓ ఉద్యోగినితో ఐదుగురు యువ‌కులు అసభ్యంగా ప్ర‌వ‌ర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు ఆ ఐదుగురు పోకిరీల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారంతా న‌గ‌రంలోని బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌లకు చెందిన వారిగా గుర్తించారు. ఆ యువ‌తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన స‌మ‌యంలో వారు మ‌ద్యం తాగి ఉన్నార‌ని చెప్పారు.

నిందితులు బాధితురాలి కాళ్లను పట్టుకుని ఎయిర్‌పోర్టులోనే క్షమాపణ కోరారు. దీంతో సదరు బాధితురాలు వారిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయక‌పోవ‌డంతో పోలీసులు కూడా వారిపై కేసు నమోదు చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది..  


Air Hostess
Misbehave
Shamshabad Air Port
  • Error fetching data: Network response was not ok

More Telugu News