సొంత సినిమాలో .. అతిథి పాత్రలో నారా రోహిత్!
- నారా రోహిత్ నిర్మాతగా 'నీది నాది ఒకే కథ'
- కథానాయకుడిగా శ్రీ విష్ణు
- కథను మలుపు తిప్పే పాత్రలో నారా రోహిత్
నారా రోహిత్ .. శ్రీవిష్ణు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వేణు ఉడుగుల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. నిడివి పరంగా చిన్నదే అయినా, కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని అంటున్నారు. ఆ పాత్రను నారా రోహిత్ చేయడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. గతంలో నారా రోహిత్ .. శ్రీవిష్ణు కలిసి నటించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.