Jagan: పోలీసులకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన జగన్!

  • ఎప్పటికీ చంద్రబాబు పాలనే ఉండదు
  • ఈ విషయాన్ని గుర్తుంచుకోండి
  • గుంటనక్కలకు సెల్యూట్ కొట్టకండి

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ చంద్రబాబు పాలన మాత్రమే ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా హుసేనాపురంలో నిర్వహించిన మహిళా సదస్సులో నేడు జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.

పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని... ప్రభుత్వం కోసం, టోపీ మీదున్న మూడు సింహాల కోసం మాత్రమే పని చేయాలని... ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తాను... అక్కలు, చెల్లెమ్మల సమస్యలు వినేందుకు వస్తే, మీరు అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు.

Jagan
jagan warning
YSRCP
  • Loading...

More Telugu News