padmavathi: 'పద్మావతి' సినిమాపై కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ సీఎం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-4c435ca98c52d80a6883e1c33559760d5cbb93ba.jpg)
- 'పద్మావతి' సినిమాకు మరో షాక్
- సినిమాపై మధ్యప్రదేశ్ లో నిషేధం
- నిర్ణయం తీసుకున్న సీఎం
'పద్మావతి' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమాపై రాజ్ పుత్ ల నిరసన జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఈ సినిమా యూనిట్ కు షాక్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో సినిమాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్ పుత్ వర్గానికి చెందిన నేతలు ఇటీవలే చౌహాన్ ను కలిసి సినిమాను నిషేధించాలంటూ విన్నవించారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల వాయిదా పడ్డప్పటికీ, నిషేధం విధించారు చౌహాన్. మరోవైపు, రాజ్ పుత్ లకు అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించకపోతే సినిమాను అనుమతించబోమని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఇప్పటికే హెచ్చరించారు.