all india badminton: అండ‌ర్ 19 ఆలిండియా బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌లో గెలిచిన గోపీచంద్ కూతురు గాయ‌త్రి

  • తల్లిదండ్రుల‌ పేరు నిల‌బెడుతున్న త‌న‌య
  • మ‌హారాష్ట్ర‌కి చెందిన పుర్వా బ‌ర్వేని ఓడించిన గాయ‌త్రి
  • గ‌తంలో ఇదే పోటీల్లో గెలిచిన గోపీచంద్ భార్య పీవీవీ ల‌క్ష్మి

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ విజేత‌, కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయ‌త్రి గోపిచంద్ కూడా బ్యాడ్మింట‌న్‌లో రాణిస్తోంది. ఆలిండియా బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్ అండ‌ర్ 19లో గాయ‌త్రి విజ‌యం సాధించింది. ఆదివారంరోజు చంఢీగ‌డ్‌లో జ‌రిగిన ఈ గేమ్‌లో గాయ‌త్రి అద్భుత ప్ర‌తిభ క‌నబ‌రిచింది. తెలంగాణ త‌ర‌ఫున పోటీ ప‌డిన గాయ‌త్రి, మ‌హారాష్ట్ర‌కి చెందిన పుర్వా బ‌ర్వేని 21-18, 23-21 తేడాతో ఓడించింది.

26 ఏళ్ల క్రితం (1991) ఇదే టోర్న‌మెంట్ మొద‌టిసారి నిర్వ‌హించిన‌పుడు గాయ‌త్రి త‌ల్లి, గోపీచంద్ భార్య పీవీవీ ల‌క్ష్మి జూనియ‌ర్స్ విభాగంలో టైటిల్ సాధించింది. ఈ ఏడాది అండ‌ర్ 17 టోర్న‌మెంట్‌లో గాయ‌త్రి విజేత‌గా నిలిచింది.

all india badminton
tournament
Pullela Gopichand
gaythri
pvv lakshmi
  • Loading...

More Telugu News