toilet day: ప్ర‌పంచంలో అతిపెద్ద టాయ్‌లెట్ బేసిన్‌.... 'ట్రంప్ విలేజ్‌'లో ఆవిష్క‌ర‌ణ‌

  • ప్ర‌పంచ టాయ్‌లెట్ దినోత్స‌వం (న‌వంబ‌ర్ 19) సంద‌ర్భంగా ఏర్పాటు
  • టాయ్‌లెట్ల ఉప‌యోగం గురించి అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం
  • ఆవిష్క‌రించిన సుల‌భ్ ఇంట‌ర్నేష‌న‌ల్ వ్య‌వ‌స్థాప‌కుడు బిందేశ్వ‌ర్ పాఠ‌క్‌

న‌వంబ‌ర్ 19, ప్ర‌పంచ టాయ్‌లెట్ దినోత్స‌వం సంద‌ర్భంగా గుర్‌గావ్‌లోని మ‌రోరా గ్రామం (ట్రంప్ విలేజ్‌)లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద టాయ్‌లెట్ బేసిన్‌ను ఆవిష్క‌రించారు. టాయ్‌లెట్ల ఉప‌యోగం, ప‌రిశుభ్ర‌త గురించి అవ‌గాహ‌న పెంచే కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ బేసిన్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీన్ని సుల‌భ్ ఇంట‌ర్నేష‌నల్ వ్య‌వ‌స్థాప‌కుడు బిందేశ్వ‌ర్ పాఠ‌క్ ఆవిష్క‌రించారు.

త్వ‌ర‌లో ఈ బేసిన్‌ను ఢిల్లీలోని సుల‌భ్ టాయ్‌లెట్ మ్యూజియంకి త‌ర‌లిస్తామ‌ని పాఠ‌క్ తెలిపారు. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో ఈ బేసిన్‌ను త‌యారుచేశారు. ఈ మారుమూల గ్రామంలో ప్ర‌తి ఇంటికి ఓ టాయ్‌లెట్ నిర్మించి ఆ గ్రామానికి 'ట్రంప్ విలేజ్' అని పాఠ‌క్ నామ‌క‌ర‌ణం చేసిన సంగ‌తి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News