payyavula kesav: పయ్యావుల కేశవ్ ఇంట ప్రారంభమైన పెళ్లిసందడి!

  • కేశవ్ అన్న కుమార్తె వివాహం
  • 23న అనంతపురంలో పెళ్లి
  • గత 10 రోజులుగా జరుగుతున్న ఏర్పాట్లు

ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. కేశవ్ అన్న శీనప్ప కుమార్తె వివాహం ఈ నెల 23న అనంతపురంలో ఘనంగా జరగనుంది. వీరి ఇంట చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న తొలి వివాహం కావడంతో, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురంలోని బళ్లారి బైపాస్ సమీపంలోని ఎంవైఆర్ ఫంక్షన్ లో పెళ్లి జరగనుంది. గత 10 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అనంతపురంలోని రామ్ నగర్ లో గల నివాసంలో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి.

పెళ్లి కుమారుడు ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు. ఈ పెళ్లికి వీవీఐపీలు, వీఐపీలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్పీలు వెంకట్రావు, నర్సింగప్ప, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడులతో కలసి పెళ్లి ఏర్పాట్లను కేశవ్ నిన్న పరిశీలించారు. 

payyavula kesav
Telugudesam
anantapur
payyavula marriage
  • Loading...

More Telugu News