kimjong un: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదట!
- క్షిపణి ప్రయోగాలు చేస్తూ దూకుడును కనబర్చే ఉత్తర కొరియా
- రెండు నెలలుగా సైలెంట్
- కిమ్ జాంగ్ ఉన్‌కి మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు
క్షిపణి పరీక్షలు చేస్తూ ఎల్లప్పుడూ దూకుడు మీదుండే ఉత్తరకొరియా ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటోంది? ఎన్ని హెచ్చరికలు వస్తున్నా, ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఎవరి మాటా వినకుండా ముందుకు వెళ్లే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రెండు నెలలుగా క్షిపణి పరీక్షలను ఎందుకు చేయడం లేదు? దీనికి కారణం, ప‌్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడమే అని తెలుస్తోంది.
కిమ్ అనారోగ్యంతో బాధపడుతుండటం వల్లే ఆ దేశం క్షిపణి ప్రయోగాలను చేపట్టడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిమ్ జాంగ్ ఉన్‌కి మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయట. కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంతో ఉన్నారని దక్షిణ కొరియా కూడా భావిస్తోంది.