padmavathi movie: 'పద్మావతి' సినిమాలో దావూద్ ఇబ్రహీం పెట్టుబడులు?

  • సినిమాలో దావూద్ పెట్టుబడులు ఉన్నాయంటూ రాజ్ పుత్ ల ఆరోపణ
  • దుబాయ్ నుంచి డబ్బులు వస్తే.. ఇక్కడ సినిమా తీశారు
  • కరాచీ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్న లోకేంద్ర సింగ్

బాలీవుడ్ సినీరంగానికి, మాఫియాకు ఉన్న లింక్ లపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో సినిమాల్లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పెట్టుబడులు పెట్టారనే వార్తలు ఎన్నో సార్లు విన్నాం. తాజాగా, ఇలాంటి ఆరోపణే మరొక్కసారి తెరపైకి వచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావతి' సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ రాజ్ పుత్ లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. హర్యానా బీజేపీ చీఫ్ భన్సాలీ, దీపిక తలలకు రూ. 10 కోట్లు వెలకట్టిన సంగతి కూడా తెలిసిందే.

ఈ నేపథ్యంలో, రాజ్ పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'పద్మావతి' సినిమాలో దావూద్ ఇబ్రహీం కూడా పెట్టుబడులు పెట్టారంటూ ఆయన ఆరోపించారు. ఢిల్లీలో నిన్న రాత్రి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ నుంచి దావూద్ డబ్బులు పంపిస్తే... ఇక్కడ భన్సాలీ సినిమా తీశారంటూ ఆయన మండిపడ్డారు. కరాచీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని అన్నారు. 

padmavathi movie
dawood ibrahim
sanjay leela bhansali
deepika padukone
bollywood
lokendra singh kalvi
  • Loading...

More Telugu News