sharwanand: మరో రెండు రోజుల్లో సెట్స్ పైకి శర్వానంద్!

  • హను రాఘవపూడితో శర్వానంద్ 
  • ఈ నెల 23వ తేదీన సెట్స్ పైకి 
  • సుధీర్ వర్మ ప్రాజెక్టు లేట్ అయ్యే అవకాశం   

ఎప్పుడూ శర్వానంద్ ఒక సినిమా తరువాత ఒక సినిమా చేస్తూ వస్తుంటాడు. అలాంటిది ఈ సారి రెండు సినిమాలు సమాంతరంగా చేయడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అందులో ఒక సినిమా కాస్త ఆలస్యంగానే మొదలయ్యేలా ఉందనేది తాజా సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలోను .. సుధీర్ వర్మ దర్శకత్వంలోను సినిమా చేయడానికి శర్వానంద్ రెడీ అయ్యాడు.

అయితే  సుధీర్ వర్మ మూవీని నిర్మించడానికి ముందుకు వచ్చిన హారిక .. హాసిని నిర్మాతలు, స్క్రిప్ట్ పరంగా కొన్ని మార్పులు చెప్పారట. వాళ్లు చెప్పిన సూచనల ప్రకారం చేయడానికి కొంత సమయం పట్టొచ్చని అంటున్నారు. ఈలోగా ఈ నెల 23వ తేదీన హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి శర్వానంద్ రెడీ అవుతున్నాడు. ఇంతవరకూ చేయని సరికొత్త పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా పూర్తయిన తరువాతనే సుధీర్ వర్మ ప్రాజెక్టును శర్వానంద్ చేస్తాడని కొంతమంది అంటుంటే, హను రాఘవపూడి సినిమా ఒకటి రెండు షెడ్యూల్స్ తరువాత సుధీర్ వర్మతో సెట్స్ పైకి వెళతాడని మరి కొంతమంది అంటున్నారు.  

sharwanand
sudheer varma
hanu raghavapoodi
  • Loading...

More Telugu News