nara rohith: హీరోగా సరైన పాత్రలు ఎంపిక చేసుకోలేకపోయాను : అజయ్

  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 'బాలకృష్ణుడు'
  • ఫ్యాక్షన్ లీడర్ గా అజయ్ 
  • 'హలో' .. 'భరత్ అనే నేను' సినిమాల్లో ప్రత్యేక పాత్రలు    

తెలుగు తెరకు విలన్ గా పరిచయమై .. ముఖ్యమైన పాత్రలను చేస్తూ .. హీరోగా కూడా తనలో కొత్త కోణాన్ని చూపించిన నటుడు అజయ్. ఏ పాత్రను పోషించినా తనదైన ముద్ర వేయడం అజయ్ ప్రత్యేకత. అలాంటి అజయ్ కీలకమైన పాత్రను పోషించిన 'బాలకృష్ణుడు' సినిమా .. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ .. "మొదటిసారిగా నేను ఈ సినిమాలో పూర్తిస్థాయి ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో కనిపించనున్నాను. ఈ పాత్ర నాకు మరింత మంచి పేరును తీసుకురావడం ఖాయమనే నమ్మకం వుంది. విలన్ గా చేస్తోన్న సమయంలోనే హీరోగా అవకాశాలు రావడంతో కాదనలేకపోయాను. అయితే హీరోగా సరైన పాత్రలను ఎంపిక చేసుకోలేకపోయాను. ప్రస్తుతం నాకు తెలుగులో తగిన అవకాశాలు రావడం లేదు. 'హలో' .. 'భరత్ అను నేను' సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తాను" అని చెప్పుకొచ్చారు.     

nara rohith
ajay
  • Loading...

More Telugu News