naga suseela: నాగార్జున సోదరి తప్పుడు కేసు పెట్టారు: శ్రీనివాస్ ఆరోపణ

  • తనను మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిన నాగ సుశీల
  • సినిమాలు ఆడకుంటే తానేం చేస్తానన్న శ్రీనివాస్
  • కొడుకు హీరోగా నిలదొక్కుకోలేని బాధలో తప్పుడు కేసులా?
  • ప్రశ్నించిన శ్రీనివాస్

తనపై అక్కినేని నాగార్జున సోదరి, నిర్మాత నాగ సుశీల తప్పుడు కేసు పెట్టారని గత 12 ఏళ్లుగా సుశీలకు వ్యాపార భాగస్వామిగా ఉన్న చింతలపూడి శ్రీనివాస్ ఆరోపించారు. తనను శ్రీనివాస్ మోసం చేశారని ఆరోపిస్తూ, 13 మందిపై కేసు పెట్టగా, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన, ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. సినిమాలు ఆడకపోతే తానేం చేయగలనని, వాటికి తానేమీ దర్శకుడిని కాదని ఆయన అన్నారు. తాము ప్రారంభించిన 'శ్రీనాగ్ ప్రొడక్షన్స్' నుంచి సుశాంత్ హీరోగా తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని, కొడుకు హీరోగా నిలదొక్కుకోలేకపోయిన బాధను తనపై చూపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాగా, వీరిద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేశారన్న సంగతి తెలిసిందే. విభేదాలను తగ్గించేందుకు నాగార్జున రంగంలోకి దిగినా ఫలితం లేకపోయిందని సమాచారం.

naga suseela
srinivas
sushant
  • Loading...

More Telugu News