Farooq Abdullah: పాక్‌ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి.. మేం చ‌నిపోవాల‌ని కోరుకుంటున్నారా?: ఫరూక్‌ అబ్దుల్లా

  • ఇప్పటికే ఒక పాకిస్థాన్‌ను సృష్టించారు
  • ఇంకా ఎన్ని పాకిస్థాన్ ల‌ను సృష్టిస్తారు?
  • దేశాన్ని ఇంకా ఎన్ని ముక్కలు చేస్తారు?
  • పాక్ గాజులు తొడుక్కుని కూర్చోలేదు

కొన్ని రోజులుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లను చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా ఈ రోజు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే ఒక పాకిస్థాన్‌ను సృష్టించారని, ఇంకా అటువంటి పాకిస్థాన్ ల‌ను ఎన్నింటిని సృష్టిస్తార‌ని, దేశాన్ని ఇంకా ఎన్ని ముక్కలు చేస్తారని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల తాను పీవోకే పాక్‌దేనని అన్నానని గుర్తు చేశారు.

తాను అన్న మాట‌లు నిజ‌మేన‌ని నొక్కి చెప్పారు. పాకిస్థాన్ వారు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? అని ప్ర‌శ్నించారు. ఆ దేశం వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయని, జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌జ‌లు చనిపోవాలని కేంద్ర ప్ర‌భుత్వం కోరుకుంటుందా? అని అన్నారు. భార‌త్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో నివసిస్తున్న పేదవారి గురించి కేంద్ర స‌ర్కారు ఆలోచించాల‌ని అన్నారు. వారు ప్ర‌తిరోజు బాంబు దాడులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News