Donald Trump: వేలంలో సిద్ధంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌, మెలానియాల వెడ్డింగ్ కేక్‌!

  • 2005 జ‌న‌వ‌రిలో జ‌రిగిన వివాహం
  • కేకులో మిగిలిన భాగాన్ని వేలం వేస్తున్న జూలియ‌న్ ఆక్ష‌న్స్‌
  • 1000 నుంచి 2000 డాల‌ర్లు ప‌లికే అవ‌కాశం

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మెలానియాల పెళ్లి జ్ఞాప‌కంగా మిగిలిన వెడ్డింగ్ కేక్ ఇప్పుడు వేలంలో ఉంది. లాస్ ఏంజెలీస్‌కి చెందిన జూలియ‌న్ ఆక్ష‌న్స్ అనే సంస్థ వీరి వెడ్డింగ్ కేక్ మిగిలిన భాగానికి వేలానికి పెట్టింది. 2005 జ‌న‌వ‌రిలో జ‌రిగిన వీరి వివాహ వేడుక‌లో 90 కేజీల కేకును ఏడు అంత‌స్తులుగా పేర్చారు. దీన్ని గ్రాండ్ మార్నీయ‌ర్ బ‌ట‌ర్ క్రీమ్‌తో త‌యారు చేసి, 3 వేల‌కి పైగా ఐసింగ్ బాల్స్‌తో డెక‌రేట్ చేశారు. దీన్ని నిల‌బెట్ట‌డానికి పెద్ద మొత్తంలో తీగ‌ల‌ను ఉప‌యోగించాల్సి వ‌చ్చింది. దీంతో ఈ కేకును అతిథులకు పంచలేకపోయారు.

ఈ కార‌ణంగా పెళ్లికి వ‌చ్చిన అతిథుల‌కు వేరే స్వీట్ బాక్సులను బ‌హుమ‌తిగా ఇచ్చి పంపించారు. ఈ స్వీట్ బాక్సులు కూడా ప్ర‌స్తుతం వేలంలో ఉన్నాయి. ఈ మిగిలిన కేకు భాగానికి వేలం ద్వారా 1000 నుంచి 2000ల డాల‌ర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని జూలియ‌న్ ఆక్ష‌న్స్ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఆయ‌న‌కు సంబంధించిన కొన్ని వ‌స్తువుల‌ను జూలియ‌న్ సంస్థ వేలంలో అమ్ముతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ఉప‌యోగించిన గోల్ఫ్ క్ల‌బ్‌ల‌ను, ఆయ‌న గీసిన ఎంపైర్ స్టేట్ భ‌వ‌నం చిత్ర‌ప‌టాన్ని ఈ సంస్థ వేలం వేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News