jagapati babu: నంది అవార్డుల వివాదం మీ ప్రాబ్లం.. నాది కాదు: జగపతిబాబు

  • నా మొదటి సినిమా మూడు రోజులు ఆడింది
  • 'లెజెండ్' మూడేళ్లు ఆడింది
  • అవార్డు రావడం సంతోషంగా ఉంది

'లెజెండ్' సినిమాకు గాను ఉత్తమ విలన్ అవార్డును గెలుచుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. తన మొదటి సినిమా 'సింహ స్వప్నం' సినిమా కేవలం మూడు రోజులు మాత్రమే ఆడిందని... 'లెజెండ్' సినిమా మూడు సంవత్సరాలు ఆడిందని చెప్పారు. ఈ సినిమాకు నంది అవార్డు కూడా రావడం సంతోషకరమని అన్నారు. నంది అవార్డులపై వివాదాలు రావడంపై ప్రశ్నించగా... 'అది మీ ప్రాబ్లం అండి... నాది కాదు' అని నవ్వుతూ వెళ్లిపోయారు. ఈ రోజు జగపతిబాబు ఓ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేశారు.  

jagapati babu
legend movie
nandi awards
tollywood
  • Loading...

More Telugu News