padmavati: సర్టిఫికెట్ ఇవ్వకుండానే 'పద్మావతి' సినిమాను వెనక్కి పంపిన సీబీఎఫ్సీ!
- వచ్చేనెల 1న 'పద్మావతి' విడుదలకు సినిమా యూనిట్ ప్రయత్నాలు
- సీబీఎఫ్సీ కోసం సినిమాను పంపిన పద్మావతి టీమ్
- దరఖాస్తుని పూర్తిగా పూరించలేదని తెలిపిన సీబీఎఫ్సీ ప్రతినిధులు
- పూర్తిగా పూరించి పంపే ప్రయత్నాలలో యూనిట్
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి చిత్రం తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటోన్న విషయం తెలిసిందే. రాజ్‌పుత్ రాణి గురించి అవాస్తవాలను తెరకెక్కించారని, దేశ వ్యాప్తంగా పలు హిందూ సంఘాలు ఆరోపిస్తూ, ఈ సినిమా విడుదల చేస్తే విధ్వంసానికి పాల్పడతామని కూడా హెచ్చరించాయి. వచ్చేనెల 1న ఈ సినిమా విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. పద్మావతి మూవీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కు పంపింది.
అయితే, నిబంధనల ప్రకారం సినీ యూనిట్ దరఖాస్తుని పూర్తిగా పూరించకపోవడంతో సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వకుండానే సీబీఎఫ్సీ దాన్ని వెనక్కి పంపింది. దీంతో ఆ సినిమా యూనిట్‌కు షాక్ తగిలింది. వెంటనే సరైన రీతిలో దరఖాస్తును పూరించి పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు ఈ సినిమా విడుదల చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కర్ణిసేన హెచ్చరికలు చేస్తోంటే, మరోవైపు పద్మావతి సినిమా బృందం మాత్రం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది.