bandla ganesh: రవితేజ చాలా మంచివాడు .. ఆయనను మోసం చేశాను: బండ్ల గణేశ్

  • నిర్మాతగా నా ఫస్టు సినిమా హీరో రవితేజ
  • ఆయనను మోసం చేయవలసి వచ్చింది 
  • ఆయనతో మరో సినిమా చేస్తాను    

తాజాగా నిర్మాత బండ్ల గణేశ్ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొనగా, " ఇంతవరకూ మీరు హీరోల్లో ఎవరినైనా మోసం చేశారా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన సమాధానమిస్తూ .. " హీరోల్లో రవితేజను మోసం చేశాను .. ఏమిటీ .. ఎందుకు ? అని అడగొద్దు. ఈ విషయం రవితేజకు తెలుసు .. ఆయనకు నేనే చెప్పాను" అన్నారు.

 "రవితేజతో 'ఆంజనేయులు' సినిమా చేస్తే నాకు 5 కోట్లు మిగిలాయి. ఆయన చాలా మంచివాడు .. అలాంటి ఆయన్ని మోసం చేయవలసి వచ్చింది. తెలియకుండా మోసం చేస్తే వేరు .. తెలిసి మోసం చేశాను. రవితేజను మోసం చేస్తున్నాను అని తెలిసి .. తప్పనిసరి పరిస్థితుల్లో మోసం చేశాను. ఏం చేశాను .. ఎలా చేశాను అనేది నాకు తెలుసు గనుక, దానిని దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. నిర్మాతగా నా ఫస్టు సినిమా హీరో ఆయనే. ఆయనతో మరో సినిమాను తప్పకుండా చేస్తాను" అని చెప్పుకొచ్చారు .    

bandla ganesh
raviteja
  • Loading...

More Telugu News