Australia: చికెన్ నగ్గెట్స్ కోసం వెళ్తే... డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న తాగుబోతు!

  • తెల్లవారు జాము 4:30 నిమిషాలకు మెక్ డోనల్డ్స్ షాప్ కు వెళ్లిన వ్యక్తి
  • చికెన్ నగ్గెట్స్ ఆర్డర్.. లేవని చెప్పిన సిబ్బంది
  • కోపంతో 230 డాలర్ల విలువైన 200 హాష్ బ్రౌన్స్ కు ఆర్డర్

చికెన్ నగ్గెట్స్ కోసం వెళ్లిన వ్యక్తి లైసెన్స్ కోల్పోయిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... సిడ్నీలో ఒక వ్యక్తి తెల్లవారుజామున 4.30 నిమిషాలకు మెక్‌ డొనాల్డ్స్‌ సెంటర్ కు చికెన్ నగ్గెట్స్ కోసం వచ్చాడు. ఆ సమయంలో అవి దొరకవని అక్కడి సిబ్బంది చెప్పడంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి 230 డాలర్ల విలువైన 200 ఫుడ్ హాష్ బ్రౌన్స్ ను ఆర్డర్ చేసి సిబ్బందిని సతాయించాడు.

గురుడు మందు కొట్టి ఉన్నాడన్న విషయాన్ని గ్రహించిన సిబ్బంది అతని బాధపడలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అతనికి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేశారు. మోతాదుకు మించి తాగి ఉన్నాడని నిర్ధారణ కావడంతో అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి, ఫైన్ వేశారు. 

Australia
mc donalds
naggets
hush browns
drinker
  • Loading...

More Telugu News