cristiano ronaldo: ఏడుగురు పిల్ల‌లు... ఏడు బాలోన్ డియోర్ అవార్డులు ... క్రిస్టియానో రొనాల్డో త‌దుప‌రి ల‌క్ష్యం ఇదే!

  • ఓ మేగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన ఫుట్‌బాల్ ఆట‌గాడు
  • ఇటీవ‌ల నాలుగో పాప‌ను ఆహ్వానించిన రొనాల్డో దంప‌తులు
  • వ‌చ్చే నెల ఐదో బాలోన్ డియోర్ అవార్డు అందుకోనున్న రొనాల్డో

రియ‌ల్ మాడ్రిడ్ జ‌ట్టు ఆట‌గాడు క్రిస్టియానో రొనాల్డో, త‌న త‌దుప‌రి ల‌క్ష్యాల గురించి ఇటీవ‌ల ఓ స్పోర్ట్స్ మేగ‌జైన్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఏడుగురు పిల్ల‌లను క‌న‌డం, ఏడు బాలోన్ డియోర్ అవార్డులు సంపాదించ‌డమే ప్ర‌స్తుతం త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని రొనాల్డో తెలిపాడు. ఇటీవ‌ల క్రిస్టియానో రొనాల్డో, అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ జార్జీనా రోడ్రిగేజ్ దంప‌తుల‌కు నాలుగో బిడ్డ జ‌న్మించింది. ఆ పాప‌కు అలానా మార్టినా అనే పేరు పెట్టారు. ఈ సంతోషంలో భాగంగా రొనాల్డో ల‌క్ష్యాల గురించి వివ‌రించాడు.

వ‌చ్చే నెల రానున్న ఐదో బాలోన్ డియోర్ అవార్డు కోసం తాను ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ ల‌క్ష్యం పూర్తైన త‌ర్వాత కూడా బాలోన్ డియోర్ అవార్డులు సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాన‌ని రొనాల్డో చెప్పాడు. అందుకోసం వీలైనంత మేర‌కు కృషి చేయడానికి తాను ఎల్ల‌ప్పుడూ సిద్ధ‌మేన‌ని పేర్కొన్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News