vishal: విశాల్ 'అభిమన్యుడు' ఫస్టులుక్ వచ్చేసింది

  • విశాల్ హీరోగా 'అభిమన్యుడు'
  • కథానాయికగా సమంత
  • ప్రతినాయకుడి పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు        

రజనీకాంత్ .. కమల్ హాసన్ .. విక్రమ్ తరువాత, తమ సినిమాలు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకునే స్టార్ హీరోల్లో సూర్య .. కార్తీ .. విశాల్ కనిపిస్తారు. రీసెంట్ గా విశాల్ తమిళంలో చేసిన ఓ సినిమా, 'డిటెక్టివ్' పేరుతో థియేటర్స్ కి వచ్చింది. ఇక సంక్రాంతికి కూడా రావడానికి విశాల్ రెడీ అవుతున్నాడు. తమిళంలో ఆయన చేసిన సినిమా తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో రానుంది.

 టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. పోస్టర్ లో స్క్రీన్ పై కనిపిస్తోన్న విశాల్ ను పరిశీలనగా చూస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ కనిపిస్తున్నాడు .. ఈ సినిమాలో విలన్ ఆయనే.

ఇక తొలిసారిగా విశాల్ సరసన కథానాయికగా సమంత నటిస్తోంది. విశాల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, పి.ఎస్. మిత్రన్ దర్శకుడిగా వ్యవహరించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయాలనే నిర్ణయంతో వున్నారు.    

  • Loading...

More Telugu News