Jagan: జగన్ లాయర్ పై సీబీఐ కోర్టు జడ్జి సీరియస్

  • నాలుగు ఛార్జ్ షీట్లను కలిపి విచారించాలని కోరిన జగన్ లాయర్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి
  • కోర్టు సమయాన్ని ఎంత కాలం వృథా చేస్తారంటూ ఆగ్రహం

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ సీబీఐ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది నాలుగు ఛార్జ్ షీట్లపై డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలంటూ నిన్న విచారణ సందర్భంగా జడ్జిని కోరారు. దీంతో, ఆయనపై జడ్జి సీరియస్ అయ్యారు. గత రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారని... ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారంటూ మండిపడ్డారు. మీరు వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయానంటూ అసహనం వ్యక్తం చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని... 'ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు... ఇకపై ఇలాంటివి కుదరవు' అంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళ్తే, సీబీఐ దాఖలు చేసిన సీసీ 9 కేసు ఛార్జ్ షీట్ ను పక్కన పెట్టాలంటూ జగన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ పై నిన్న సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 8, 10, 14 ఛార్జ్ షీట్లను కూడా కలిపి విచారించాలని జగన్ తరపు లాయర్ అశోక్ రెడ్డి కోరారు. దీనిపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. కలిపి విచారించేందుకు గతంలో కోర్టు కూడా అనుమతిచ్చిందని లాయర్  తెలపగా... గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాల్లో ఏముందో తనకు తెలుసంటూ జడ్జి అన్నారు. నిన్న సాయంత్రం 4.30 వరకు జగన్ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు.  

  • Loading...

More Telugu News