Flight: ఆకాశంలో పెను ప్రమాదం.. విమానం, హెలికాప్టర్ ఢీ!

  • భూమికి వెయ్యి అడుగుల ఎత్తులో ప్రమాదం
  • నలుగురు దుర్మరణం
  • కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు

ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్స్‌లో అత్యంత అరుదైన ప్రమాదం జరిగింది. ఓ తేలికపాటి విమానం, హెలికాప్టర్ ఆకాశంలో ఒకదాన్నొకటి డీకొన్నాయి. హాల్టన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ బేస్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పైలట్లకు శిక్షణ ఇచ్చే వైకోమ్ ఎయిర్ పార్క్ నుంచి విమానం బయలుదేరిన 15 నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్‌లో ఉన్న ఒకే ఒక్క ప్రయాణికుడు, పైలట్, విమానంలోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. భూమికి వెయ్యి అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం, హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

పెద్ద శబ్దం వినిపించిందని, బయటకొచ్చి చూస్తే విమానం, హెలికాప్టర్ ఢీకొని కింద పడ్డాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అక్కడికి వెళ్లి చూస్తే నలుగురు మృతి చెంది ఉన్నారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఏడు పైర్ ఇంజిన్లు, మూడు రెస్క్యూ వాహనాలు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News